సినీ నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్ ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని హైకోర్టు సమర్థించింది. శ్రీపరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ తీసుకున్న రుణాల రికవరీ కోసం 2022లో జరిగిన ఈ వేలాన్ని రద్దు చేస్తూ గతంలో డీఆర్‌టీ ఇచ్చిన తీర్పును జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌ల ధర్మాసనం కొట్టేసింది. ఈ ఆస్తి కంపెనీది కాదని, హామీదారుల వ్యక్తిగత ఆస్తి అయినందున ఎన్‌సీఎల్‌టీ మొరటోరియం దీనికి వర్తించదన్న బ్యాంకు వాదనతో కోర్టు ఏకీభవించింది.