ఏపీ మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, సినీ నిర్మాత బండ్ల గణేష్ నివాసానికి వెళ్లారు. బండ్ల గణేష్ కుమార్తె జనని పెళ్లి ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పరిటాల సునీత హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బండ్ల గణేష్ నివాసానికి వెళ్లిన పరిటాల సునీత, నూతన దంపతులకు పట్టువస్త్రాలు పెట్టి ఆశీర్వాదం అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.