సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. హైదారాబాద్‌లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పెళ్లి వేడుకకు హాజరు కాగా.. వారిని చూసి బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. కళ్లనీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.