బాగ్ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ప్రారంభించారు. వచ్చే బతుకమ్మ నాటికి కుంట సిద్ధమవుతుందని ఆయన తెలిపారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం నాడు కొలిక్కి వచ్చిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా లోగోను మార్చి.. నీటిని సూచించేలా కొత్త లోగోను రూపొందించింది. ఈ కొత్త లోగో జలవనరుల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ.. సంస్థ లక్ష్యాలను మరింత స్పష్టంగా తెలియజేస్తుంది.