బస్సు ఆపలేదనే కోపం.. ఛేజ్ చేసి ఆర్టీసీ డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ..

2 hours ago 2
ఆర్టీసీ బస్సు ఆపలేదనే కారణంగా ఓ మహిళ డ్రైవర్ మీద చెప్పుతో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. అవనిగడ్డ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సును.. పులిగడ్డ వంతెన వద్ద ఆపేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. అయితే డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవటంతో .. బస్సును వెంబడించిన మహిళ, మోపిదేవి సెంటర్ వద్ద బస్సులోకి ఎక్కి డ్రైవర్ మీద చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత బంధువులతోనూ డ్రైవర్‌ను కొట్టించింది. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం.
Read Entire Article