బస్సు టర్న్ తీసుకుంటుండగా.. వేగంగా వచ్చిన బైక్

8 months ago 11
హైదరాబాద్‌: జీడిమెట్ల పోలీసు స్టేషన్ సమీపంలో శనివారం (జూన్ 28) ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టర్న్ తీసుకుంటుండగా.. అదే సమయంలో ఇద్దరు యువకులు శివ, భాను బైక్‌పై అతివేగంతో వచ్చి బస్సును ఢీకొన్నారు. రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు.. హుటాహుటిన వారి వద్దకు చేరుకొని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శివకు ప్రాణాపాయం ఏమీలేదని, బైక్‌ నడిపిన భాను పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు.
Read Entire Article