తెలంగాణలో ఆర్టీసీలో నేటి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల విధానం, ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులతో సంస్థలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు బస్‌భవన్‌లో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేయనున్నారు.