Husband killed wife Bapatla: బాపట్ల జిల్లా సంతమాగులూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త.. తన భార్యను దారుణంగా హత్య చేసి.. బైక్ మీద ఆమె మృతదేహాన్ని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. విభేదాలు రావటంతో గత కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆదివారం ఉదయం ఆమెను గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లిన భర్త వెంకటేశ్వర్లు గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత బైక్ మీద మృతదేహాన్ని తీసుకుని వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.