వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ అధికార టీడీపీ, విపక్షవైసీపీ మధ్య ట్వీట్ల వార్ జరుగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు గురించి సీఎం చంద్రబాబు ట్వీట్ చేసిన కాసేపటికే మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పపడుతున్నారని జగన్ ఆరోపించారు. ప్రాజెక్టుకు శిలాఫలకం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు.