హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. డ్రాలో ఎంపికైనంత మాత్రాన వెంటనే ఇల్లు కేటాయించబోమని, క్షేత్రస్థాయిలో వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది కేటాయింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. ఎంపికైన వారి అర్హతలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే అవకాశం కల్పిస్తామన్నారు. శనివారం ఖైరతాబాద్, కూకట్‌పల్లి, అంబర్‌పేట, బహదూర్‌పుర నియోజకవర్గాల్లో మొత్తం 1,920 ఇళ్లకు లబ్ధిదారులను ప్రాథమికంగా ఎంపిక చేశారు.