వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ తిరుమలలో కార్తీరిష్టి యాగం నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ మూడో తేదీ వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణ జపం, హోమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆదివారం అంకురార్పణ జరిగింది. మరోవైపు సెప్టెంబర్ నాలుగో తేదీ గోకులాష్టమి సందర్భంగా తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.