బాబూ నీళ్లు తీసుకో.. థ్యాంక్స్ అండి.. రాజ్యసభలో ఆసక్తికర సీన్

1 month ago 4
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం రాజ్యసభలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు గురువారం రాజ్యసభలో భారతీయ వాయు యాన్‌ విధేయక్‌ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ దాహార్తికి గురయ్యారు. దీంతో మంచినీళ్లు తెప్పించమని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ను కోరారు. ఆయన నీరు తెమ్మని సిబ్బందిని ఆదేశించారు. వారు నీళ్లు తెచ్చేలోపు ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి తన వద్ద ఉన్న మంచినీళ్ల సీసాను తెచ్చి రామ్మోహన్‌నాయుడికి అందించారు. ఆమె వాత్సల్యానికి ముగ్ధుడైన రామ్మోహన్‌నాయుడు ఆమెకు రెండు చేతులతో నమస్కరించి ధన్యవాదాలు చెబుతు... ఆమె ఎప్పుడూ తల్లిలా తనపట్ల ఆదరణ చూపుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్నివేశం రాజ్యసభలో అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
Read Entire Article