దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు షురూ అయ్యాయి. అయితే.. గణపతి నవరాత్రోత్సవాల్లో వినాయకుని విగ్రహాలతో పాటు లడ్డూలు కూడా ప్రత్యేకత సంతరించుకుంటాయి. అందులో బాలాపూర్ గణేష్ లడ్డూనే టాప్. గతేడాది ఏకంగా 27 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ ఈసారి ఎంత పలుకుతుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రక్రియను నిర్వాహకులు మార్చేశాడు. ముందుగా ఆ డబ్బును డిపాజిట్ చేస్తేనే వేలం పాటలో పాల్గొనే ఛాన్స్ ఇవ్వనున్నారట..!