బాలింత చితాభస్మంలో కత్తెర.. ఈ ఒక్క క్లూతో తల్లీబిడ్డల మృతికి కారణమేంటో తెలిసిపోయిందిగా!

2 months ago 13
ప్రసవ సమయంలో తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలో.. మరణించిన బాలింత చితాభస్మంలో శస్త్రచికిత్స కత్తెర లభ్యమవ్వడం తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో స్టాఫ్ నర్సు ఆధ్వర్యంలో కాన్పు జరగ్గా.. తీవ్ర రక్తస్రావంతో బాలింత వనజ, ఆమె నవజాత శిశువు మరణించారు. అయితే అంత్యక్రియల అనంతరం బూడిదను సేకరిస్తుండగా లభించిన సర్జికల్ కత్తెరే వైద్యుల ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా.. తాము అసలు ఆపరేషనే చేయలేదంటూ వైద్యాధికారులు బుకాయిస్తున్నారు.
Read Entire Article