బంగ్లాదేశ్ బాలికను అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిపై అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన విక్రమ్ అలీ.. 2012లో భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. అలీఘడ్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని.. ఆధార్ కార్డు కూడా సంపాదించుకున్నాడు. అయితే విక్రమ్ అలీకి ఇటీవల బంగ్లాదేశ్ బాలికతో పరిచయమైంది. దీంతో పెళ్లి చేస్తానని నమ్మించి కాకినాడ జిల్లాకు తెచ్చాడు. అక్కడ ఓ ఇంట్లో రెండు నెలల కింద బంధించాడు. అయితే రైళ్లో తీసుకువెళ్తున్న సమయంలో అనకాపల్లి పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.