బాసర ఆలయాన్ని తిరుమల తరహాలో తీర్చిదిద్దాలని ఇటీవలె సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.225 కోట్లను కేటాయించారు. ఇందులో భాగంగానే బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పూజ చేయనున్నారు. ఈ క్రమంలోనే బాసర ఆలయ నమూనాను సంబంధిత అధికారులు విడుదల చేశారు. 9 అంతస్తుల రాజగోపురంతోపాటు.. దేవాలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది.