ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించగా.. పలు మీడియాల్లో వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రకటనపై స్పందించిన మావోయిస్టు పార్టీ.. ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. బడే చొక్కారావు చనిపోలేదని.. బతికే ఉన్నాడని.. స్పష్టం చేసింది. ఈమేరకు.. సంచలన లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.