ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 4 లక్షల ఇండ్లను మంజూరు చేయగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి 1 లక్ష, జూన్‌కు మరో 2 లక్షల గృహ ప్రవేశాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జీ+3 పద్ధతిలో ఇళ్లు నిర్మించేందుకు అర్బన్ హౌసింగ్ పాలసీని త్వరలో ప్రకటిస్తారు. ఈ పథకంలో అవినీతికి పాల్పడిన 9 మంది కార్యదర్శులను సస్పెండ్ చేశామని మంత్రి తెలిపారు.