ఏపీ సీఎం చంద్రబాబును ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఎకనమిక్ టైమ్స్ సంస్థ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును చంద్రబాబు అందుకున్నారు. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు ఈ అవార్డును అందుకున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది. ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, వ్యాపార అనుకూల వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ప్రకటించారు.