బియ్యం తరలిస్తుంటే.. ఏం చేస్తున్నారు: పవన్ కళ్యాణ్ సీరియస్

1 month ago 4
కాకినాడ పోర్టు రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిపోయిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంత భారీగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తీరప్రాంత జిల్లాల్లో ఏ మాత్రం భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇది దేశ భద్రతకే తీవ్ర ముప్పుగా పరిగణిస్తుందన్నారు. పోర్టు నుంచి యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు, మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. కాకినాడ అత్యంత ప్రమాదకరమైన పోర్టు అని ప్రధాని, కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానన్నారు. పోర్టులో తనిఖీలకు వెళ్లాలనుకుంటే రెండునెలలుగా తనను అధికారులు అడ్డుకుంటున్నారని.. తానొస్తే పదివేల కుటుంబాల జీవితాలు అతలాకుతులం అయిపోతాయని చెబుతూ తనకు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అయిన నాకే అధికారుల నుంచి అసలు సహకారం లేదన్నారు. డీఎస్‌ బియ్యం ఉన్న భారీనౌకను సీజ్‌ చేయడంతోపాటు పోర్టు సీఈవోకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే కొండబాబును ప్రశ్నించారు.
Read Entire Article