తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పాత ఫీజులే బీ టెక్ కాలేజీల్లో అమలులో ఉంటాయని కౌన్సెలింగ్ నిర్వహించారు. చాలా మంది విద్యార్థులు కూడా ఆయా కాలేజీల్లో జాయిన్ అయ్యారు. దీంతో గత సంవత్సరం ఎలాంటి ఫీజులు వసూలు చేశారో.. ప్రస్తుతం కూడా అవే ఫీజులు వసూలు చేశారు. ఆ ఫీజులకే విద్యార్థులు అడ్మిషన్లు కూడా తీసుకున్నారు. అయితే ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఫీజులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా.. వీటిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.