బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధుల అడ్డగింతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంత మందిపై గతంలో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. తనకు నోటీసులు ఇవ్వలేదని, ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకపోయినా అక్రమంగా తనను అరెస్ట్ చేస్తున్నారని ఎర్రోళ్ల ఆరోపించారు.