ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలో బీఆర్ఎస్ తన ఆర్థిక వివరాలను వెల్లడించింది. పార్టీ ఆస్తుల విలువ సుమారు రూ.1,509 కోట్లుగా పేర్కొంది. ఇందులో బ్యాంకు నగదు, డిపాజిట్ల రూపంలో రూ.1,431 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలో పార్టీకి సుమారు రూ.114 కోట్ల ఆదాయం రాగా.. కార్యకలాపాల కోసం రూ.162 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రచారానికి రూ.137 కోట్లు వెచ్చించగా.. ప్రకటనలు, బహిరంగ సభలు ప్రధాన ఖర్చులుగా నిలిచాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రూ.1.60 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.