వరంగల్‌లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. సభ కోసం 1213 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇవ్వగా, వారి సహకారానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సభ వల్ల దెబ్బతిన్న పొలాలను తిరిగి బాగు చేస్తామని, రైతులకు నష్టం జరగకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.