తాను పార్టీ మారుతాను అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. తన పుట్టుక, చావు అన్నీ బీఆర్ఎస్ పార్టీలోనే అని తేల్చి చెప్పారు. పార్టీలు మారే రేవంత్ రెడ్డికి.. నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు తిరిగిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారని.. రేపు ఇంకే పార్టీలోకి వెళ్తారోనని ఎద్దేవా చేశారు.