Adari Anand Kumar In Bjp: విశాఖ డెయిరీ ఛైర్మెన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ పిల్లా రమాకుమారి బీజేపీలో చేరారు. రాజమహేంద్రవరంలో జీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఇటీవల విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డెయిరీ డైరెక్టర్లు వైఎస్సార్సిపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు లేఖ రాసి పంపారు.