ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో భాగంగా.. మంగళవారం (జనవరి 28) రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన కుటుంబంతో కలిసి కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన కుంభమేళాలో చేసిన ఏర్పాట్ల గురించే కాకుండా కుంభమేళాపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.