హైదరాబాద్ నగరవాసులకు ఓఆర్ఆర్ సమీపంలో మరో ఇంటర్‌ఛేంజ్ అందుబాటులోకి రాబోతుంది. బుద్వేల్ వద్ద రేడియల్ రోడ్-2 ఇంటర్‌ఛేంజ్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. సుమారు 250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు.. బుద్వేల్ లేఅవుట్‌ను నేరుగా ఔటర్ రింగు రోడ్డుతో అనుసంధానిస్తుంది. దీనివల్ల శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఐటీ కారిడార్‌కు ప్రయాణ సమయం తగ్గుతుంది.