Telugu Girl Died In Bangalore Stampede: బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ విషాదంగా ముగిసింది. తొక్కిసలాటలో 11 మంది మరణించగా, వారిలో అన్నమయ్య జిల్లాకు చెందిన దివ్యాంశి అనే బాలిక కూడా ఉంది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులైన పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈవెంట్ నిర్వహించిన ఏజెన్సీ ప్రతినిధులను అరెస్టు చేయాలని ఆదేశించింది. అసలు ఈ దుర్ఘటనకు కారణమెవరు? లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడిన నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?