Bobbili Police Seized 4 Kg Gold: విజయనగరం జిల్లా బొబ్బిలిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో సోదాలు చేశారు. గంజాయి నియంత్రణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ గదిలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి కంగారు పడ్డారు. వారి దగ్గర ఉన్న అట్టపెట్టెలను పరిశీలించగా ఆభరణాలు కనిపించాయి. వాటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి సీజ్ చేశారు. ఎలాంటి పత్రాలు లేని నాలుగు కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.