ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జాతీయ స్థాయి కుంభకోణమంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్దలు ఎవరో తేలాలన్న షర్మిల.. సముద్రంలో బోట్లు వేసుకుని హడావిడి చేయడం కాకుండా.. దీనిపై ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించాలని..లేదంటే సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కష్టపడి పంట పండించిన రైతుకు దక్కేది కన్నీళ్లు అయితే.. బియ్యం మాఫియాకు మాత్రం కాసులు దక్కుతున్నాయంటూ షర్మిల ఆరోపించారు.