బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ వ్యవహారంలో కొంతమంది దళితుల ప్రస్తావన తెస్తుండటంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. నేరాలకు, కులానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అనిల్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఇప్పుడు దళిత కార్డు తెస్తున్నవారు.. గత ప్రభుత్వ హయాంలో దళితుల మీద దాడులు జరుగుతున్న సమయంలో ఏమయ్యారని వంగలపూడి అనిత ప్రశ్నించారు. తనపైనా 23 కేసులు నమోదైన విషయాన్ని వంగలపూడి అనిత గుర్తుచేశారు.