సిద్దిపేట-హనుమకొండ బుధవారం తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. లక్షల రూపాయల విలువైన బీర్లతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. సుమారు 25 లక్షల రూపాయల విలువైన బీర్లు నేలపాలైనట్లు తెలుస్తోంది. బీర్లను సంగారెడ్డి నుండి హనుమకొండకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు బీర్లు చోరీకి గురికాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.