బ్యాటరీ మింగేసిన 10 నెలల బాలుడు.. ఎండోస్కోపీ ద్వారా బయటకు తీసిన వైద్యులు

1 month ago 3
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ చిన్నారి బ్యాటరీ సెల్ మింగేశాడు. పది నెలల వయసు ఉన్న చిన్నారి ఆడుకుంటూ బ్యాటరీ సెల్ మింగేశాడు. అయితే కుటుంబసభ్యులు వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే గుర్తించిన కుటుంసభ్యులు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎక్స్ రే తీసిన వైద్యులు కడుపులో బ్యాటరీ సెల్ ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా దానిని తొలగించారు. దీంతో చిన్నారి కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే చిన్నారులు ఇంట్లో ఉన్నప్పడు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Entire Article