విజయ డెయిరీ పేరుతో మార్కెట్‌లో నకిలీ పాలను విక్రయిస్తున్నారని డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. విజయ పేరుతో ఎవరైనా నకిలీ పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అలాంటి పాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. నకిలీ పాల విక్రయంపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు వెల్లడించారు.