భారతీయ నర్సు నిమిష ప్రియ కేసులో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బ్లడ్ మనీ ఆమెను కాపాడుతుందా? మరణశిక్ష తప్పుతుందా అని కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. భారత ప్రభుత్వం ఆమెను కాపాడేందుకు ఉన్న అన్నీ ప్రయత్నాలను చేస్తోంది. కేరళ ముస్లిం మత పెద్ద ముస్లియార్ కూడా యెమెన్ పౌరులతో తనకున్న సంబంధాలతో తన వంతు కృషి చేస్తున్నారు. నిమిష ప్రియ కేసుతో ‘బ్లడ్ మనీ’ చర్చనీయాంశంగా మారింది. అయితే, గతంలో బ్లడ్ మనీ పలువురు భారతీయులను కాపాడిందని తెలుసా..? నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎలా కాపాడారు? కీలక వివరాలు..