భక్తులకు అలర్ట్.. రేపు మేడారంలో దర్శనాలు రద్దు.. కారణం ఇదే..

8 months ago 24
ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల దర్శనాలను బుధవారం (డిసెంబరు 24న) ఒక రోజంతా నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం ప్రకటించింది. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతర కోసం ప్రభుత్వం శాశ్వత అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ప్రారంభించనున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో దర్శనాలను రద్దు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ ప్రయాణాలను ఒక రోజు వాయిదా వేసుకోవాలని, ఎల్లుండి నుంచి దర్శనాలు కొనసాగుతాయని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు.
Read Entire Article