భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు స్థలాలు.. ఆ రెండు ప్రాంతాలు అనుకూలమని నివేదిక

2 months ago 11
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపాదిత భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి కీలక అడుగు పడింది. విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లాలోని సీతంపేట, సుజాతనగర్‌ ప్రాంతాలు అత్యంత అనుకూలమైనవని స్వతంత్ర సాంకేతిక సంస్థ రాజ్‌ టెక్నాలజీస్‌ తన అధ్యయనంలో తేల్చింది. దాదాపు 667 ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు అవకాశం ఉందని నివేదిక రూపొందించింది. ఈ సమగ్ర సాంకేతిక నివేదికను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు లేఖ ద్వారా పంపించి, ప్రాజెక్టుకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కోరారు.
Read Entire Article