భర్తకు కునికిపాట్లు.. డ్రైవింగ్‌ సీటులో భార్య.. ఇంతలో ఊహించని ఘోరం

1 month ago 4
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంట కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డారు. పి.గన్నవరం మండలం పొతవరం గ్రామానికి చెందిన కుటుంబం విశాఖ జిల్లా అరకు పర్యటనకు వెళ్లి.. ఇంటికి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భర్తకు నిద్రమత్తు రావడంతో భార్య డ్రైవింగ్ సీటులోకి వచ్చారు. 5 కిలోమీటర్ల డ్రైవింగ్ చేసిన తర్వాత మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఊహించని విధంగా కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య ఉమ, పెద్దకుమారుడు రోహిత్‌ మృతిచెందారు. వారి మృతదేహాలను స్థానికులు కాలువ నుంచి బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Read Entire Article