ఏపీ టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పలు సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. సోమవారం మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ చేసిన పలు సంస్కరణలకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ వివరాలను మంత్రి నారాయణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 15 మీటర్ల వరకూ ఉన్న భవన నిర్మాణాలకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదన్న నారాయణ.. అంతకంటే ఎక్కువ ఎత్తుంటే సర్వేయర్.. ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో ఉంచి ఫీజు చెల్లిస్తే సరిపోతుందన్నారు.