భారత్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ట్రాఫిక్ ఈ చలాన్‌లకు సంబంధించి రికార్డు స్థాయిలో చెల్లింపులు జరుగుతున్నాయి. గతేడాది నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 4.5 లక్షలు.. తెలంగాణలో 1.3 లక్షల ట్రాఫిక్ ఈ చలాన్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.