తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ బాధ్యతలను సింగపూర్‌కు చెందిన డీపీ ఆర్కిటెక్ట్స్ సంస్థకు అప్పగించింది. జూన్ 10న మీర్‌ఖాన్‌పేట కార్యాలయంలో దీనికి సంబంధించిన అవార్డు లేఖను అందిస్తారు. 9 నెలల్లో సిద్ధం కానున్న ఈ ప్లాన్‌లో 765 చ.కి.మీ పరిధిలోని 30 వేల ఎకరాల మౌలిక సదుపాయాలను గుర్తిస్తారు. ఇందులో ప్రధానంగా లైఫ్ సైన్సెస్ 4 వేల ఎకరాలు, ఈవీ పార్క్ 1976 ఎకరాలు, ఏఐ సిటీ 403 ఎకరాలు, హెల్త్ సిటీలకు భూములను కేటాయించి హెచ్ఎండీఏ గ్రిడ్‌తో సమన్వయం చేయనున్నారు.