తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన నుంచి విడిపోయిన భార్య వేరే వ్యక్తితో కలిసి నివశించడం తట్టుకోలేక ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్య తల్లి, సోదరిపై కత్తితో దాడి చేశాడు. అత్తా వదినలపై విచక్షణారహితంగా దాడి చేయటంతో.. అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. వదిన స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.