12 ఏళ్ల కిందట వివాహమైన జంట.. పెళ్లయిన ఐదేళ్లకే విడిపోయింది. అయితే, ఈ మధ్య కాలంలో కొడుకుపై తండ్రికి మనస్సు మళ్లింది. తన కొడుకును తన వద్దే ఉంచుకోవాలి అనుకున్నాడు. దానికి భార్య, అత్తమామలు, బావమరిది ఒప్పుకోలేదు. తన కొడుకును తనకు కాకుండా దూరం చేస్తున్నారన్న కోపం భార్యని బైక్‌పై పుట్టింటికి తీసుకొస్తూ బండరాయితో మోదీ హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా ఆ భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో చోటుచేసుకుంది.