Bhimavaram Doctor Cheated In Cyber Fraud: భీమవరంలో ఓ డాక్టర్ అమాయకంగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఓ ఫోన్ కాల్ తీయడమే తప్పైంది.. మొత్తం రూ.72 లక్షలు మాయం చేశారు. సైబర్ పోలీసుల పేరుతో డాక్టర్‌కు ఫోన్ కాల్ వచ్చింది.. ఆయన పేరుపై ముంబై నుంచి కొరియర్ వచ్చిందని నమ్మించారు. అందులో డ్రగ్స్, పాస్‌పోర్టులు, సిమ్‌లు ఉన్నాయన్నారు.. ఆ తర్వాత మెల్లిగా బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగి మాయ మాటలు చెప్పారు. ఆ తర్వాత అసలు మోసం జరిగింది.