తెలంగాణలో భూభారతి పోర్టల్‌లో రద్దు చేసుకున్న భూ లావాదేవీల సొమ్ము వెనక్కి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు రూ. 150 కోట్లు ఇలానే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. స్టాంపుల శాఖ వెనక్కి ఇస్తున్నా.. భూభారతి ద్వారా చెల్లించిన సొమ్ముకు ప్రత్యేక విధానం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో బాధితులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జీవో-59 కింద తిరస్కరణకు గురైన 3,140 మందికి చెల్లించాల్సిన రూ. 63 కోట్లు కూడా నిలిచిపోయింది.