భూగర్భజలాలను పెంచే మెట్ల బావులు.. అకర్మ ఫౌండేషన్‌తో కలిసి హైడ్రా పునరుద్ధరణ

8 hours ago 1
హైదరాబాద్‌లోని పురాతన మెట్ల బావులను గుర్తించి.. వాటి చారిత్రక వివరాలను నమోదు చేసి, పునరుద్ధరించేందుకు హైడ్రా అకర్మ ఫౌండేషన్‌తో కలిసి కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే సుమారు 150 బావులను గుర్తించగా.. మరో 50 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బన్సీలాల్‌పేట్‌, కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని బావుల తరహాలో మరిన్ని నిర్మాణాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. చెత్త, పూడిక తొలగించడం, వర్షపు నీరు చేరేలా అనువైన ఏర్పాట్లు చేయడం ద్వారా ఈ బావులను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు భూగర్భ జలాల అభివృద్ధి, పర్యాటకానికి ప్రోత్సాహం, ఆక్రమణల నివారణపై కూడా దృష్టి సారించనున్నారు.
Read Entire Article