హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఆకలిగా ఉందని హోటల్కు వెళ్లి మటన్ మండి తింటుండగా.. ఓ వ్యక్తికి అనుకోని సంఘటన ఎదురైంది. మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను కనిపించడంతో ఆ కస్టమర్ షాక్ అయ్యాడు. అయితే దానిపై హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తే, సరైన సమాధానం ఇవ్వలేదని.. పైగా యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా. రెస్టారెంట్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. తనిఖీల సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పారబోశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.