తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూముల అక్రమ అమ్మకాలు అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22(ఏ) కింద రూపొందించిన నిషేధిత భూముల జాబితా రికార్డులను డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఈ జాబితాలను సిద్ధం చేశారు. వీటిలో తప్పులు దొర్లడంతో సవరణల అనంతరం ఈ తుది జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడానికి రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడి, భూముల క్రయ విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుంది.