ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. జనవరి 26న నాలుగు పథకాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో అర్హులైన ప్రతి పేద వాడికి పార్టీలతో సంబంధం లేకుండా ఇండ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.